''సాధారణంగా మనం వైషయికానందాలతో కాలం గడుపుతూ ఉంటాము. ఇవన్నీ నిలకడలేని క్షణికములైన ఆనందాలు. వీనివలన కాలం వ్యర్థం అగుట యే కాక జీవనశక్తి సన్నగల్లి పోతూ ఉన్నది. సినీమాలకు వెళ్ళటం-హోటళ్లలో రుచికరములైన పదార్థాలను ఆరగించటం, ఇవి లేక పోతే మనం బ్రతుకలేమన్న మాట కాదు. కాని మానవ సేవ అన్నమాట వచ్చేసరికి తీరుబాటు, ద్రవ్య సదుపాయము లేదని అనుకొంటూ ఉంటాం. భగవంతుడు మన కిచ్చిన అవకాశాలను మనం సద్వినియోగం చేసుకోవాలి. మన అందరి హృదయాలలోను ఈ సేవాభావం దృఢంగా నాటు కొన్ననాడు మనం విశ్వమానవ కళ్యాణ దీక్షా కంకణ బుద్ధులమై ముందంజ వేయగలం.''
|